మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (12:47 IST)

ఈసీఐఎల్ నుంచి 650 ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన సంస్థలల్లో ఒకటైన ఈసీఐఎల్ నుంచి 650 ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులు ఈవీఎం(EVM), వీవీపాట్(VVPAT)లకు సంబంధించిన సీలింగ్, డిస్ట్రిబ్యూషన్, పోలింగ్ తదితర విధుల్లో పాలు పంచుకోవాల్సి ఉంటుంది. వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లికేషన్లను పంపించాల్సి ఉంటుంది.
 
ఫస్ట్ క్లాస్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. 
 
ఇతర అర్హతల వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. అభ్యర్థులు 30 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, బీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఏడు రోజుల్లోపు ఈసీఐఎల్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
 
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 15 మధ్యాహ్నం 2 గంటలలోపు ఆన్లైన్ లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో అప్లికేషన్లను సబ్మిట్ చేసిన అనంతరం అభ్యర్థులు అప్లికేషన్ ప్రింట్ కాపీని తీసుకోవాలి. అభ్యర్థుల బీటెక్ మార్కులు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.