శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (15:05 IST)

1557 క్లర్క్ పోస్టుల భర్తీ.. తెలంగాణలో 20, ఏపీలో-10 పోస్టులు

దేశవ్యాప్తంగా వున్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (ఐబీపీఎస్‌) నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 23వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో మొత్తం 1557 పోస్టులను భర్తీ చేయనుంది.
 
బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ఇతరత్రా బ్యాంకుల్లో ఈ పోస్టులున్నాయి. కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది.
 
మొత్తం పోస్టులు- 1557
ఇందులో తెలంగాణలో- 20, ఆంధ్రప్రదేశ్‌లో- 10 చొప్పున పోస్టులు ఉన్నాయి.
20 నుంచి 28 ఏండ్ల లోపువారై ఉండాలి.
దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 2
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 23
 
అర్హతలు- ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 
అదేవిధంగా కంప్యూటర్ పరిజ్ఞానం, కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేయడం తప్పనిసరి. 
కంప్యూటర్ ఆపరేషన్స్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి.
 
హైస్కూల్ లేదా కాలేజీలో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ
 
ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామ్: డిసెంబర్ 5, 12, 13
ప్రిలిమ్స్ ఫలితాల విడుదల: డిసెంబర్ 31
 
మెయిన్స్ కాల్ లెటర్స్: జనవరి 12
మెయిన్స్ ఆన్‌లైన్ ఎగ్జామ్: 2021 జనవరి 24
ప్రొవిజనల్ అలాట్‌మెంట్: 2021 ఏప్రిల్ 1