శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 13 జూన్ 2018 (11:31 IST)

దేశంలోని బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలు... ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కటి లేదా?

దేశంలో ఉన్న ఉత్తమ ఇంజనీరింగ్ కాలేజీల జాబితాను కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ తాజాగా ప్రకటించింది. ఈ జాబితా మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క బెస్ట్ కాలేజీ కూడా లేకపోవడం గమనార్హం. కానీ, తెలంగ

దేశంలో ఉన్న ఉత్తమ ఇంజనీరింగ్ కాలేజీల జాబితాను కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ తాజాగా ప్రకటించింది. ఈ జాబితా మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క బెస్ట్ కాలేజీ కూడా లేకపోవడం గమనార్హం. కానీ, తెలంగాణ రాష్ట్రంలో రెండు కాలేజీలు ఉన్నాయి.
 
'ఇండియా ర్యాంకింగ్ రిపోర్టు 2018' పేరిట విడుదల చేసిన ఈ జాబితాలో మొత్తం 30 కాలేజీలు చోటుదక్కించుకున్నాయి. ఇంజినీరింగ్ కళాశాలల నిర్వహణ, బోధన, అధ్యయనం, అందుబాటులో ఉన్న వనరులు, పరిశోధనల ప్రాతిపదికగా దేశంలో 2018వ సంవత్సరానికిగాను వీటిని ఎంపిక చేశారు. ఆ కాలేజీ వివరాల మేరకు... 
 
దేశంలో టాప్ 30 ఇంజినీరింగ్ కళాశాలల జాబితా... 
1. ఐఐటీ - మద్రాస్, 2. ఐఐటీ - బాంబే, 3. ఐఐటీ - ఢిల్లీ, 4. ఐఐటీ - ఖరగ్‌పూర్, 5. ఐఐటీ - కాన్పూర్, 6. ఐఐటీ - రూర్కీ 7. ఐఐటీ - గౌహతి, 8. అన్నా యూనివర్శిటీ - చెన్నై, 9. ఐఐటీ - హైదరాబాద్, 10. ఐసీటీ - ముంబై, 11. ఎన్ఐటీ - తిరుచనాపల్లి, 12, జాదవ్‌పూర్ యూనివర్శిటీ - కోల్‌కతా, 13.ఐఐటీ - ధన్‌బాద్, 14. ఐఐటీ - ఇండోర్, 15. ఎన్ఐటీ - రౌర్కెలా, 16. వీఐటీ - వేలూరు, 17. బిట్స్ - పిలానీ, 18 ఐఐటీ - భువనేశ్వర్, 19. ఐఐటీ - వారణాసి, 20. థాపర్ ఐఈటీ - పాటియాలా, 21. ఎన్ఐటీ - సూరత్‌కల్, 22. ఐఐటీ - రోపార్, 23. ఐఐఎస్‌ఎస్‌టీ - తిరువనంతపురం, 24. ఐఐటీ - పాట్నా, 25. ఎన్ఐటీ - వరంగల్, 26. బీఐటీ - రాంచీ, 27. ఐఐటీ - గాంధీనగర్, 28. ఐఐటీ - మండీ, 29. పీఎస్జీ ఇంజినీరింగ్ కళాశాల - కోయంబత్తూర్, 30. ఐఐఈఎస్‌టీ - షీబ్ పూర్ (హౌరా)లు ఉన్నాయి.