గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 నవంబరు 2023 (20:01 IST)

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఎస్బీఐలో 5,447 పోస్టుల భర్తీ

Jobs
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎస్బీఐలో భారీగా కొలువుల కోసం ఆన్‌లైన్‌‌లో దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో మొత్తం 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో రెగ్యులర్ ఖాళీలు 5,280, బ్యాక్‌లాగ్ ఖాళీలు 167 ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్ సర్కిల్‌లో 425, అమరావతి సర్కిల్‌లో 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 
 
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 5,447 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీవో) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.