గురువారం, 7 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (11:54 IST)

తెలంగాణాలో రూ.58 వేల వేతనంతో 1226 ఉద్యోగాలు

jobs
తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో జ్యూడీషియల్ మినిస్టీరియల్ సర్వీసు కింద వివిధ జిల్లాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 1226 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సమ్మతించింది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల విద్యార్హత ఏడో తరగతి నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, అభ్యర్థుల వయసు కూడా జూలై ఒకటో 2022 నాటికి 18 నుంచి 34 యేళ్ళ మధ్య ఉండాలి. 
 
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జనవరి 31, 2023 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు జనవరి 11 నుంచి ప్రారంభమవుతాయి. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, డబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష 2023 మార్చి నెలలో నిర్వహిస్తారు. ఎంపికైన వారికి రూ.19 వేల నుంచి రూ.58 వేల వరకు వేతనం చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవచ్చు.
 
జిల్లా వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే, 
ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీలు 10, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖాళీలు 19, హైదరాబాద్ జిల్లాలో ఖాళీలు 36, సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్‌లో 125, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు, హైదరాబాద్‌లో 26, హన్మకొండలో ఖాళీలు 19, జగిత్యాలలో ఖాళీలు 32, జనగామలో 13, జయశంకర్ భూపాలపల్లిలో 18, జోగులాంబ గద్వాల జిల్లాలో 25, కామారెడ్డిలో 14, కరీంనగర‌ులో 12, ఖమ్మంలో 13, ఆసిఫాబాద్‌లో 11, పాలమూరులో 33, మెదక్‌లో 16, మెడ్చల్ మల్కాజిగిరిలో 92, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిలో 128, ములుగులో 14, నాగర్ కర్నూలులో 28, నల్గొండలో 55, నారాయణపేటలో 11, నిర్మల్‌లో 18, నిజామాబాద్‌లో 20, పెద్దపల్లిలో 41, రాజన్న సిరిసిల్లలో 26, రంగారెడ్డిలో 150, సంగారెడ్డిలో 30, సిద్ధిపేటలో 25, సూర్యాపేటలో 38, వికారాబాద్‌లో 27, వనపర్తిలో 19, వరంగల్‌లో 21, భువనగిరిలో 34 చొప్పున ఖాళీలు ఉన్నాయి.