కారులో యువతిపై నలుగురు టెక్కీల అత్యాచారయత్నం
చెన్నై నగరంలో ఓ దారుణం జరిగింది. ఒక యువతిపై నలుగురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అత్యాచారా యత్నానికి పాల్పడ్డారు. అదీ కూడా కదులుతున్న కారులో ఈ దారుణానికి ఒడిగట్టారు. దీంతో ఆ యువతి కేకలు వేయడంతో రాత్రిపూట గస్తీ పోలీసులు గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, నగరానికి చెందిన ఒక యువతి మరో నలుగురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు దురైప్పాక్కంలోని ఒక ఐటీ కంపెనీలో టెక్కీలుగా పని చేస్తున్నారు. వీరంతా కలిసి ఒక నక్షత్ర హోటల్‌లో మందుపార్టీ చేసుకున్నారు. అర్థరాత్రి వరకు పీకలదాకా మద్యం సేవించారు.
ఆ తర్వాత తెల్లవారుజామున తమతమ ఇళ్లకు వెళ్లేందుకు అందరూ కలిసి ఒక కారులో బయలుదేరారు. ఆ కారు హోటల్‌ను వీడి ప్రధాన రహదారి పైకి వెళ్లిన తర్వాత ఆ యువతిపై నలుగురు స్నేహితులు అత్యాచారం చేసేందుకు యత్నించారు. దీంతో ఆ యువతి బిగ్గరగా కేకలు వేసింది.
ఆ సమయంలో రోడ్లపై గస్తీ తిరుగుతున్న పెట్రోలింగ్ పోలీసులు ఈ విషయాన్ని గమనించి కారును, అందులోని టెక్కీలతో పాటు యువతిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక థౌజండ్ లైట్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.