తనను లైంగికంగా తృప్తి పరచడం లేదంటూ సినీ నటికి భర్త వేధింపులు

woman victim
జె| Last Modified సోమవారం, 27 జనవరి 2020 (19:52 IST)
తన రెండో భర్త తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఓ సినీ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమిళనాడులోని చెన్నైలో ఈ ఘటన చోటచేసుకుంది. మొగప్పైర్ తూర్పు ప్రాంతానికి చెందిన 39 సంవత్సరాల మహిళ తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సినిమాలు, టీవీ షోల్లో సపోర్టింగ్ కారెక్టర్లు చేస్తూ జీవనం గడుపుతోంది. దీంతోపాటు సొంతంగా యోగా క్లాస్‌లు కూడా నిర్వహిస్తూ ఉంటుంది. కొన్నాళ్ల క్రితం శివకార్తికేయన్ నటించిన మన్ కరాటే సినిమాలో నటిస్తున్న సమయంలో ఆమెకు శరవణన్ సుబ్రమణితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా రెండవ వివాహానికి దారి తీసింది.

అయితే ఈమధ్య కాలంలో తన రెండో భర్త తన వద్ద ఉన్న డబ్బును దోచుకున్నారని, బంగారాన్ని తీసుకెళ్లిపోయారని, తనను లైంగికంగా వేధిస్తున్నారని తిరుమంగళంలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా అతడి స్నేహితులను ఇంటికి తీసుకొచ్చి వారి ముందు డ్యాన్స్ చేయాలంటూ తన మీద ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. శరవణన్‌కి గతంలో ఆర్తి అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. కానీ ఆ విషయం తనకు చెప్పకుండా దాచిపెట్టి తనను పెళ్లిచేసుకున్నాడని ఆరోపిస్తోంది బాధితురాలు.దీనిపై మరింత చదవండి :