శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 ఏప్రియల్ 2018 (12:55 IST)

తెలుగు జర్నలిస్టు అసోసియేషన్ (తేజస్)కు‌ నూతన కార్యవర్గం...

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఉన్న వివిధ తెలుగు పత్రికా, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాకు చెందిన పాత్రికేయ మిత్రులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న పాత్రికేయ సంఘం పేరు "తెలుగు జర్నలిస్ట్స్అసోసియేషన్" (తేజస్)

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఉన్న వివిధ తెలుగు పత్రికా, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాకు చెందిన పాత్రికేయ మిత్రులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న పాత్రికేయ సంఘం పేరు "తెలుగు జర్నలిస్ట్స్అసోసియేషన్" (తేజస్). ఈ సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం రెండేళ్ళ (2018-2020)పాటు కొనసాగుతోంది.
 
ఈ నూతన కార్యవర్గంలో తేజస్ అధ్యక్షులుగా జి. సంజయ్ రావు (సాక్షి టీవీ), ప్రధాన కార్యదర్శిగా జి.వెంకటేశ్వర రావు (ప్రముఖాంధ్ర), కోశాధికారిగా పి.నరసింహా రావు (వెబ్‌దునియా), ఉపాధ్యక్షులుగా బాలసుబ్రమణ్యం (న్యూస్ ఎక్స్), జి. అరుణ్ కుమార్ (ఆంధ్రజ్యోతి), సహాయ కార్యదర్శులుగా సురేష్ (టీవీ 5), శ్రీనివాస్ (ఈటీవీ), కమిటీ సభ్యులుగా రాజు (టైమ్స్ ఆఫ్ ఇండియా), ప్రవీణ్ (ఆంధ్రజ్యోతి), పి. గోపాల్ (99 టీవీ), ప్రదీప్ (10టీవీ), కేకే.రావు (వార్తా), సెల్వి (వెబ్‌దునియా)లు ఎంపికయ్యారు.
 
ఈ నూతన కార్యవర్గానికి శనివారం జరిగిన తేజస్ వార్షిక సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు జి. సంజయ్ రావు మాట్లాడుతూ, చెన్నైలోని తెలుగు పాత్రికేయ మిత్రుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అలాగే, పాత్రికేయ మిత్రులకు ఆరోగ్య కార్డులను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు డాక్టర్ బాషా (ఆంధ్రజ్యోతి చెన్నై బ్యూరో), ప్రభాకర్ (ఈనాడు ఇన్‌ఛార్జ్), ఎన్. మునిరత్నం(ఈనాడు), మాధురి (ఈనాడు), ఏ.ఎం.వేణుమాధవ్ (వెబ్‌దునియా) తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థ తెలుగు పాత్రికేయుల సంక్షేమం కోసం గత 2002లో ఏర్పాటైంది.