సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 జులై 2021 (23:06 IST)

వర్షాకాలం పిల్లలు జాగ్రత్త.. పిజ్జా, బర్గర్లు వద్దు..

kids
పిల్లలు ఎక్కువగా పిజ్జా, బర్గర్ ఇలాంటివి తినడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి జంక్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అలానే వీధిలో అమ్మే ఆహారం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. వీటి ద్వారా బ్యాక్టీరియల్ సమస్యలు వస్తాయి.

అందుకే విటమిన్-సి కలిగిన పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఎక్కువగా బత్తాయి, నిమ్మ, ఆపిల్, అరటి పండ్లు, టమాటా, బీట్రూట్ లాంటివి తీసుకోవడం చేయాలి. దీనితో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. పిల్లలు తీసుకునే ఆహారంలో రోగనిరోధకశక్తిని పెంపొందించే ఆహారం, ఆకుకూరలు, పండ్లు, ఉండేటట్లు చూసుకోవాలి.
 
తీసుకోవాల్సిన జాగ్రత్తలు... 
* వర్షాకాలంలో బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా గొడుగు తీసుకెళ్లాలి. రెయిన్‌కోట్‌ తప్పక ధరించాలి.
* ప్రతిరోజూ వేడివేడిగా విజిటబుల్‌ సూప్‌ తీసుకోవాలి. అనేక పోషకాలతో పాటు కమ్మని రుచిని ఇస్తుంది.
* అల్లం టీ, హెర్బల్‌ టీ తాగితే మంచిది.
 
* సమతులాహారం తీసుకోవాలి. రోడ్డు పక్కల అమ్మే ఆహారం అసలు తీసుకోవద్దు. సేవ్‌ పూరీ, పానీ పూరీ వంటి వాటికి దూరంగా ఉంటే మంచిది.
* వర్షంలో తడిచినప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే షవర్‌ స్నానం చేయాలి. అప్పుడు జలుబు రాకుండా నివారించుకోవచ్చు.
* తాగే నీరు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిల్టర్‌ నీటిని లేదా కాచి వడపోసిన నీటిని తాగాలి.
* ఎక్కువగా నీటిని తాగడం వల్ల జలుబు, జ్వరాలను నివారించవచ్చు. ఎక్కువ మోతాదులో నీరు తీసుకుంటే శరీరంలో ఉన్న విషపదార్థాలు, హానికారక సూక్ష్మక్రీము లను నివారించవచ్చు.
 
* వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం వల్ల సూక్ష్మక్రిములు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. కాబట్టి చేతులు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. తినే ముందు పిల్లలు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి.
 
* ఇంట్లో, ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్చి ఉంటే దోమలు వ్యాప్తి చెందుతాయి. మలేరియా, డెంగ్యూ వ్యాధులు రావడానికి దోమలే కారణం. కాబట్టి నీటి నిల్వలను నివారించండి. దోమల నుంచి రక్షణ పొందడానికి దోమతెరలు వాడాలి.