గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (22:35 IST)

పిల్లలకు ఎలాంటి ఆహారం పెడుతున్నారు...

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆహారం విషయంలో మనం ఉండాల్సినంత జాగ్రత్తగా ఉంటున్నామో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎత్తుకు తగ్గ బరువుతో బలంగా, శక్తిగా ఉన్నామో లేదో చూసుకోవాలి. బరువు ఎక్కువై, ఊబకాయం తెచ్చుకుంటే ఎంత కష్టమో, తక్కువై బలహీనంగా ఉన్నా అంతే కష్టం. కనుక సమతుల్యతను కాపాడుకోవాలి. 
 
ఆహారంలో ఉండే పోషకాలు శక్తిని విడుదల చేస్తాయి. మనలో చాలామంది చేసే తప్పు ఏమిటంటే, ఆహారం రుచిగా ఉంటె సరిపోతుంది అనుకుంటాం. కానీ ఆహారం శుచిగా ఉండటం అంతకంటే ముఖ్యం. పరిశుభ్రంగా లేని పదార్ధాల వల్ల లేనిపోని జబ్బులొస్తాయి. అలాగే నిలవున్న పదార్ధాలు విషతుల్యం అయ్యి, ఫుడ్ పాయిజన్‌గా మారే ప్రమాదం ఉంది. మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.  
 
1. ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవడంవల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్సు అందుతాయి.
2. వీలైనంతవరకు ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకపోవడం మంచిది.
3. రుచికి, చూపులకు బాగుంటుంది కదాని పోలిష్ పట్టిన తెల్లటి బియ్యాన్ని వాడతాం. కానీ దంపుడు బియ్యపు అన్నం ఎంతో శ్రేష్టం.
4. అన్నం కంటే ఎక్కువగా కూరలను తినడం మంచిది.
5. ఆయా సీజన్లలో దొరికే పండ్లను సేవిస్తుండాలి.
6. నీళ్ళు బాగా తాగాలి. రోజుకు నాలుగు లీటర్లకు తక్కువ కాకుండా తాగితే మంచిది.
7. ఎక్కువ నీళ్ళు తాగి, తరచుగా యూరిన్ పాస్ చేయడం వల్ల శరీరంలో చోటుచేసుకున్న మలినాలు చాలావరకూ వెళ్ళిపోతాయి.
 8. ఫాస్ట్‌ ఫుడ్స్‌ కంటే పిల్లలకు సీజనల్‌గా వచ్చే పండ్లనన్నింటినీ పిల్లలకు పెడితే మంచి పోషక విలువలు చేకూరి, అన్నిట్లో చురుకుగా ఉంటారని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.