గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 జులై 2014 (17:31 IST)

ఫ్రెంచ్ ఆనియన్ సూప్ ఎలా చేయాలి!

ఉల్లిచేసే మేలు తల్లి చేయదంటారు.. అలాంటి ఉల్లిపాయల్ని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎప్పుడూ ఆంటీ-బయోటిక్‌గా పనిచేసే ఉల్లిపాయతో ఫ్రెంచ్ ఆనియన్ సూప్ ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:  
బటర్: 50 గ్రాములు 
ఉల్లిపాయ ముక్కలు: రెండు కప్‌లు 
వైట్ పెప్పర్ పౌడర్: 1/2 కప్
సూప్ పౌడర్: ఒక కప్ 
 
ఇలా చేయండి:
బాణలిలో నూనెను పోసి అందులో ఉల్లిపాయముక్కల్ని బ్రౌన్‌గా వేయించండి. ఇందులో సూప్ పౌడర్‌ను కలిపి కొంత నీటిలో మరిగించండి. ఉప్పు, పెప్పర్ పౌడర్, ఛీస్, ఉల్లిపాయ తరుగులను కాస్త చేర్చి దించేయండి. ఈ ఆనియన్ సూప్‌ను వేడి వేడిగా సర్వ్ చేయండి. ఇందులో కాస్త కొత్తిమీర తరుగుల్ని కూడా చేర్చితే రుచికరంగా ఉంటుంది. ఈ సూప్‌లో టేస్ట్ కోసం బ్రెడ్ ముక్కల్ని కూడా చేర్చుకోవచ్చు.