శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By Selvi
Last Updated : గురువారం, 25 సెప్టెంబరు 2014 (17:51 IST)

చైనీస్ స్టైల్.. గోబీ మంచూరియన్ ఎలా చేయాలి..?

చైనీస్ స్టైల్.. గోబీ మంచూరియన్ ఎలా చేయాలో తెలుసా.. అయితే ట్రై చేయండి. కాలీఫ్లవర్ మధుమేహాన్ని దూరం చేస్తుంది. ఇంకా డయాబెటిస్ టైప్ 2ను నియత్రిస్తుంది. పిల్లలకు ఎంతో నచ్చే ఈ రెసిపీని ఎలా చేయాలంటే.. 
 
కావల్సిన పదార్థాలు: 
 
కాలీఫ్లవర్: రెండు కప్పులు 
0నూనె: డీప్ ఫ్రై చేయడానికి 
 
సరిపడా పిండి కలుపుకోవడం కోసం కావల్సిన పదార్థాలు: మైదా: ఐదు టేబుల్ స్పూన్లు, కార్న్ స్టార్చ్: 3 టేబుల్ స్పూన్లు ఉప్పు: రుచికి సరిపడా బ్లాక్ పెప్పర్: పావు టీ స్పూన్, నీళ్ళు: పావు కప్పు, చిరుధాన్యాలు: రెండు టేబుల్ స్పూన్లు 
 
సాస్ కోసం: నూనె: ఒక టేబుల్ స్పూన్, ఉల్లిపాయ అరకప్పు, పచ్చిమిర్చి: పావుకప్పు, వెల్లుల్లిపాయలు : 3 పెద్దవి కెచప్: 2 టేబుల్ స్పూన్లు, రెడ్ చిల్లీ సాస్: 2 టేబుల్ స్పూన్లు, నీళ్ళు: 4 టేబుల్ స్పూన్లు కార్న్ స్టార్చ్: 2 టేబుల్ స్పూన్లు, సోయాసాస్: 4 టేబుల్ స్పూన్లు, వైట్ వెనిగర్: 2 టేబుల్ స్పూన్లు.
 
 
తయారుచేయు విధానం: 
 
ముందుగా నాన్ స్టిక్ పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు వెల్లుల్లి రెబ్బలు వేసి 4-5నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి మారగానే అందులో కెచప్ మరియు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసి నూనె పైకి తేలే వరకూ ఫ్రై చేసుకోవాలి. సోయా సాస్ మరియు వెనిగర్ వేసి బాగా మిక్స్ చేయాలి. 
 
తర్వాత రెండు టీస్పూన్ల కార్న్ స్టార్చ్ నాలుగు టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసి బాగా మిక్స్ చేస్తూ 5నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఈ సాస్‌ను పక్కన పెట్టుకోవాలి.
 
ఇంతలో పిండిని తయారుచేసుకోవాలి. మైదా, కార్న్ స్టార్చ్, ఉప్పు, బ్లాక్ పెప్పర్ మరియు నీళ్ళు ఒక మిక్సింగ్ బౌల్లో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండి మిశ్రమంలో కాలీఫ్లవర్‌ను వేసి డిప్ చేసి కాగుతున్న నూనెలో వేసి డీఫ్ ఫ్రై చేసుకోవాలి. వీటికి సాస్‌ను యాడ్ చేసి మిక్స్ చేయాలి. తర్వాత మీడియం మంట మీద హీట్ చేయాలి. ఏమాత్రం తేమలేకుండా ఫ్రై చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే గోబీ మంచూరియన్ టేస్ట్ చేసినట్లే