శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By PNR
Last Updated : మంగళవారం, 1 జులై 2014 (13:40 IST)

మష్రూమ్ ఫ్రైను ఎలా తయారు చేస్తారు?

కావలసిన పదర్థాలు :
మష్రూమ్ : పెద్దవి 10 
ఉల్లిపాయలు : 1/2 కప్పు
క్రీం : 2 చెంచాలు
బటర్ 4 చెంచాలు
పెప్పర్ సరిపడ
స్పినాచ్ : 1/2 కప్పు
కార్న్ కెర్నల్స్ : 4 చెంచాలు (మెదిపినవి) 
ఉప్పు : కావలసినంత 
వెల్లుల్లి పేస్టు : 1/2 చెంచా 
 
తయారీ విధానం :
మష్రూమ్ కాడలు కట్ చేసి పైన మష్రూమ్ క్యాప్స్‌ని ప్రక్కన ఉంచాలి. ఈ కాడలను చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ప్యాన్‌లో 2 చెంచాల బటర్ ‌వేసి వేడి చేసిన తర్వాత ఉల్లిముక్కలు, వెల్లుల్లి పేస్టు వేసి కలుపుతూ 30 సెకండ్లు వేపాలి. వీటికి మష్రూమ్ కాడల యొక్క పీసెస్, స్పినాచ్, ఒరిజిన, ఉప్పు, పెప్పర్, కార్న్ కెర్నల్స్ జత చేసి ఒక నిమిషం బాగా మిక్స్ చెయ్యాలి. మష్కూమ్ క్యాప్స్‌ని ఒక్కొక్కటి తీసుకొని ఈ విశ్రమాన్ని కూరి ప్రక్కన ఉంచాలి. మిగితా అన్నింటిని కూడా ఫిల్ చేసి పెట్టాలి. ఈ లోపు ప్యాన్ పెట్టి మిగతా బటర్ వేసి వేడి చేసి దాంట్లో ఈ స్టఫ్‌డ్ మష్రూ‌మ్స్ పెట్టాలి. వాటి మీద మూతపెట్టి మధ్యస్థంగా మంట ఉంచి కుక్ చెయ్యాలి. కొంచెంసేపటి తర్వాత క్రీం కూడా వేసి ఇంకొంచెం సేపు ఉడికించి తీసి వేడి వేడిగా సర్వ్ చెయ్యాలి.