శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By
Last Updated : శుక్రవారం, 12 అక్టోబరు 2018 (16:10 IST)

ఆమ్లెట్ చక్కని షేప్‌లో రావాలంటే..?

ఆమ్లెట్ చక్కని షేప్‌లో రావాలంటే.. గుడ్డు సొనలో పావు చెంచా శెనగపిండి గిలకొట్టి ఆమ్లెట్ వేస్తే సరిపోతుంది. అన్నం ఉడికేటప్పుడు రెండు చుక్కల నిమ్మరసం వేస్తే అన్నం తెల్లగా వస్తుంది.

ఆమ్లెట్ చక్కని షేప్‌లో రావాలంటే.. గుడ్డు సొనలో పావు చెంచా శెనగపిండి గిలకొట్టి ఆమ్లెట్ వేస్తే సరిపోతుంది. అన్నం ఉడికేటప్పుడు రెండు చుక్కల నిమ్మరసం వేస్తే అన్నం తెల్లగా వస్తుంది. అదే చెంచా నూనె వేస్తే అన్నం పొడిపొడిగా ఉంటుంది. 
 
క్యాబేజీ కూర ఉడికేటప్పుడు ఒక బ్రెడ్ ముక్కను వేస్తే పచ్చివాసన రాదు. కాలీప్లవర్ ముక్కలను రెండు నిమిషాల పాటు వేడినీళ్ళలో వేస్తే పురుగులు పైకి తేలుతాయి. లేదా ఒక గిన్నెలో నీరు తీసుకొని అందులో రెండు చెంచాల వెనిగర్ వేసినా పురుగులు పైకి తేలతాయి.
 
నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటిని ఫ్రిజ్‌లో ఉంచటం కంటే ఒక పాత్రలో చల్లని నీరు పోసి అందులో వేయటం మంచిది. అయితే ఆ పాత్రలో నీరు మాత్రం రోజూ మారుస్తూ ఉండాలి. 
 
వంకాయలు, అరటికాయలు కట్ చేసిన తర్వాత కొంచెం మజ్జిగ కలిపిన ఉప్పునీటిలో వేస్తే ముక్కలు రంగు, రుచి మారవు. చేపలు, కోడి మాంసం, రొయ్యలు వండేందుకు ముందు ఎక్కువ పసుపు పట్టించి 20 నిమిషాలు ఉంచి తర్వాత ఉప్పుతో కడిగి వండితే నీచు వాసన రాదు.