ఒత్తిడిని దూరం చేయాలంటే.. చేపలు, పుట్టగొడుగులు తినాల్సిందేనా?

ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (11:07 IST)

ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. ముడిధాన్యాలు, సీ ఫుడ్స్ అధికంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మటన్, చికెన్‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని వారు చెప్తున్నారు. విటమిన్‌-డి లోపం వల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే ఉదయం ఎండలో తిరగడం లేదా చేపలూ పుట్టగొడుగులూ తినటం చేయాలని వారు సూచిస్తున్నారు. 
 
వీటితో పాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా వున్న ఆహారమైన చేపలు, అవిసె, బాదం, పిస్తా, వాల్‌నట్స్‌ తీసుకోవాలి. విటమిన్‌-ఎ, సి, ఇ లు శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటం ద్వారా మెదడు కణాలను రక్షిస్తాయి. కాబట్టి ఇవి సమృద్ధిగా ఉండే పండ్లూ కూరగాయల్ని తినడం వల్ల ఒత్తిడిపరమైన సమస్యలన్నీ తగ్గుతాయి. 
 
ముడిధాన్యం, పాలు, గుడ్లు, చేపలతోపాటు ఆకుకూరలూ పండ్లూ బీన్స్‌ వంటివి తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇంకా ఒత్తిడిని ఇవి దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అల్పాహారంలో నీళ్లకు బదులు పాలు వాడితే..

అల్పాహారంలో కోడిగుడ్డు, తృణధాన్యాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తద్వారా ...

news

బ్రౌన్ రైస్ తీసుకుంటున్నారా? బాగా నమిలి తినాలట..

వైట్‌ రైస్‌తో పోల్చితే బ్రౌన్‌రైస్‌లో మాంగనీస్‌, పాస్ఫరస్‌ రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయని ...

news

ఎలాంటి ఆహార పదార్థాలను కొనాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మనం తీసుకునే ఆహారం ఎంత పుష్టికరమైనదైనా శుభ్రత లోపిస్తే ఆరోగ్యం దెబ్బతిని రోగాలకు గురి ...

news

వగరు రుచి ఆరోగ్య రహస్యాలు... ఎక్కువగా తీసుకుంటే పురుషుల పని అంతే...

వగరుతో వుండే పదార్థాలను తినడం కష్టమైనా ఆరోగ్యకరమైనది. గొంతు, నాలుకపై వెంటనే దీని ప్రభావం ...