శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 2 జులై 2018 (18:16 IST)

పెరుగుతో... గుడ్డు కూర తయారీ విధానం...

పెరుగులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. దీనివలన ఎముకలు గట్టిపడుతాయి. అధిక రక్తపోటు సమస్యలకు చాలా ఉపయోగపడుతుంది. వేసవిలో ఈ పెరుగును తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చును. వాతం, కఫాలను తగ్గ

పెరుగులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. దీనివలన ఎముకలు గట్టిపడుతాయి. అధిక రక్తపోటు సమస్యలకు చాలా ఉపయోగపడుతుంది. వేసవిలో ఈ పెరుగును తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చును. వాతం, కఫాలను తగ్గించే గుణాలు పెరుగులో పుష్కలంగా ఉన్నాయి. మరి అటువంటి పెరుగుతో గుడ్డు కూర ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
గుడ్లు - 4
టమోటాలు - పావుకిలో
బఠాణీలు - 1 కప్పు
పెరుగు - అరకప్పు
ఉల్లిపాయలు - 2
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
ఉప్పు - తగినంత
కొత్తిమీర తురుము - 2 స్పూన్స్
నూనె - సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా టమోటాలు గుజ్జులా తయారుచేసుకోవాలి. బఠాణీలు ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉల్లిముక్కులు  వేసి బాగ వేయించాలి. ఆ తరువాత టమోటా గుజ్జును అందులో వేసి తగినన్ని నీళ్లను పోసి ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం ఉడికిన తరువాత బఠాణీలు, పెరుగు వేసి కలుపుకుని రెండు నిమిషాల పాటు ఉడికోవాలి. గుడ్లను సగానికి కట్‌చేసి వాటికి ఉప్పు, గరంమసాలా, కారం చల్లి ముందుగా ఉడికించుకున్న మిశ్రమంలో వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుని చివరగా కొత్తిమీర తురుము వేసి బాగా కలుపుకోవాలి. అంతే పెరుగు-గుడ్డు కూర రెడీ.