శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 జూన్ 2018 (17:19 IST)

ఇండియన్ వయాగ్రా పుచ్చకాయ.. ఆ మందు ఎలా చేయాలంటే?

వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయ అంటే అందరికీ ఇష్టమే. నీటి శాతం అధికంగా వుండే ఈ పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దాహార్తిని తీర్చే ఈ పుచ్చకాయను వేసవి అందరూ ఇష్టపడి తింటారు. రుచితో పాటు ఆరోగ్య

వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయ అంటే అందరికీ ఇష్టమే. నీటి శాతం అధికంగా వుండే ఈ పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దాహార్తిని తీర్చే ఈ పుచ్చకాయను వేసవి అందరూ ఇష్టపడి తింటారు. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలుండే పుచ్చకాయలో ఇనుము, విటమిన్ సి, ఏ, బీ6, బీ1, పొటాషియం, మెగ్నీషియం వంటి ధాతువులున్నాయి. 
 
వంద గ్రాముల పుచ్చలో 90 శాతం నీరు, 46 శాతం కెలోరీలు, కార్బొహైడ్రేడ్లు ఏడు శాతం వున్నాయి. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పుచ్చకాయ భారతీయ వయాగ్రా అనే విషయం చాలామందికి తెలియదు. పుచ్చకాయ  పైకప్పు (తెల్లటి) భాగం వీర్యవృద్ధికి తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
 
ఇందులో పైటో న్యూట్రీయన్స్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చురుకుగా వుండేలా చేస్తుంది. పుచ్చలోని సిట్రూలిన్, లైకోపిన్‌లు వయాగ్రా తరహాలో రక్త నాళాలను విచ్చుకునేలా చేసి.. రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. ఇక ఇంట్లోనే సులభంగా ప్రకృతిపరమైన వయాగ్రా ఎలా చేయాలో చూద్దాం.
 
ముఖ్యంగా ఈ రిసిపీలో పంచదార, ఉప్పును చేర్చకూడదు. 
కావలసిన పదార్థాలు: 
పుచ్చకాయ ముక్కలు, నిమ్మరసం 
తయారీ విధానం: పుచ్చ పైకప్పున గల తెల్లటి ముక్కలను మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గుజ్జు దాదాపు ఒక లీటరు వుండేలా చూసుకోవాలి. ఆపై ఒక పాత్రలో ఆ జ్యూస్‌ను తీసుకుని.. స్టౌమీద పెట్టి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత నిమ్మరసాన్ని అందులో చేర్చి.. బాగా కలిపి రెండు నిమిషాలు మరిగించాలి. ఈ గుజ్జు అరలీటర్ అయ్యేదాక మరిగించాలి. అలా గుజ్జుగా తయారైన పుచ్చకాయ మిశ్రమాన్ని కాసేపు ఆరనివ్వాలి. తర్వాత బాగా శుభ్రపరిచిన సీసాల్లో పుచ్చ మిశ్రమాన్ని భద్రపరచాలి. ఈ సీసాను ఫ్రిజ్‌లో పెట్టేసుకోవాలి. 
 
ఎలా తీసుకోవాలంటే? 
సీసాలో భద్రపరిచిన పుచ్చకాయ గుజ్జును రోజుకు రెండుసార్లు రెండు టేబుల్ స్పూన్ల మేర తీసుకోవాలి. ఉదయం పరగడుపున ఓసారి, రాత్రి భోజనానికి గంట ముందు తీసుకోవాలి. ఈ పుచ్చకాయ గుజ్జు వీర్యవృద్ధికి సహకరిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అంటే ఒకరకంగా పుచ్చకాయ ప్రకృతి సహజసిద్ధ వయాగ్రాగా పని చేస్తుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.