శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (11:11 IST)

శరీరానికి ఎండ తగలక పోతే ఊబకాయం...

చాలా మంది ఎండలకు ఎండ వేడిమికి అధిక ఉష్ణోగ్రతలకు భయపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు బయపడుతుంటారు. ఇలా ఎండను చూసి భయపడి కూర్చుంటే బరువు పెరగుటకు దోహదపడుతారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలైనా సూర్యరశ్మి శర

చాలామంది ఎండలకు ఎండ వేడిమికి అధిక ఉష్ణోగ్రతలకు భయపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు బయపడుతుంటారు. ఇలా ఎండను చూసి భయపడి కూర్చుంటే బరువు పెరగుటకు దోహదపడుతారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలైనా సూర్యరశ్మి శరీరాన్ని తాకేవిధంగా చూసుకోవాలని పరిశోధకులు పేర్కొన్నారు. అలా చేయకపోతే శరీరానికి అవసరమైన విటమిన్ డి అందక ఊబకాయం తయారయ్యే ప్రమాదం ఉన్నది.
 
విటమిన్ డి శరీరానికి క్యాల్షియం గ్రహించే శక్తినిస్తుంది. సూర్యకాంతి పడక విటమిన్ తయారవకపోతే శరీరంలో క్యాల్షియం లోపం ఏర్పడుతుంది. దీని ఫలితంగా శరీరం దృఢత్వాన్ని కోల్పోయి నీరసంగా మారుతారు. భారీ ఊబకాయం కలవారు క్యాల్షియం లోపం కలిగి ఉంటారు. కాబట్టి మీరు మీ పిల్లలతో సహా సాయంత్రపు ఎండల సమీపంలోని పార్క్‌లకు వెళ్లితే మంచిది.
 
ఇంటి పెరడు ఉంటే కూడా అక్కడ పిల్లలతో చేరి వాకింగ్ చేస్తే మంచిది. ఏసీ ఉన్న ఆఫీసుల్లో పనిచేసేవారు బరువు పెరగడానికి కారణం వారికి ఎండ తగలక పోవడమే కారణం. కాబట్టి ఊబకాయానికి గురికాకుండా ఉండాలంటే రోజూ కాస్త ఎండలో తిరగడం ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు తెలియజేశారు.