శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (10:20 IST)

ఫ్రెషర్స్ పార్టీలో కలకలం - 182 మంది వైద్య విద్యార్థులకు కోరనా

కర్నాటక రాష్ట్రంలోని ధార్వాడ్ వైద్య కాలేజీలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఈ కాలేజీలో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీలో ఏకంగా 182 మంది వైద్య విద్యార్థులు కరోనా వైరస్ బారినపడ్డారు. వీరిలో ఎక్కువ మంది కరోనా డోసుల టీకాలు వేయించుకున్నవారే కావడం గమనార్హం. అయితే, వీరికి సోకింది కరోనా కొత్త వేరియంటా లేకా కరోనా వైరస్సేనా అనే దానిపై పరీక్షలు చేస్తున్నారు. 
 
ఈ వైద్య కాలేజీలో ఇటీవల మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ఫ్రెషర్స్ డే ను నిర్వహించారు. ఇందులో కరోనా నిబంధనలన్నీ తుంగలో తొక్కేశారు. ఇక్కడే దెబ్బకొట్టింది. ఈ పార్టీలో పాల్గొన్న విద్యార్థుల్లో ఏకంగా 182 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో కాలేజీలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. 
 
ఈ వైద్య కాలేజీలో కరోనా వైరస్ కేసు నమోదుపై జిల్లా వైద్య శాఖ అధికారులు స్పందిస్తూ, ఈ వైరస చాలా వేగంగా వ్యాపిస్తుందన్నారు. అందుకే ఇది కొత్త వేరియంటా అనే అంశంపై టెస్టులు చేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా, కరోనా టీకాలు వేయించుకున్న విద్యార్థులు కూడా ఈ వైరస్ బారినపడటం ఆందోళన కలిగించే అంశమన్నారు. ఈ వైరస్ సోకినవారందరినీ హోం క్వారంటైన్‌‍కు తరలించినట్టు చెప్పారు. అలాగే ప్రైవేరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించే పనిలో ఉన్నట్టు తెలిపారు.