గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (16:54 IST)

ఏపీలో కరోనా విజృంభణ.. 758 మందికి కరోనా, నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకీ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 758 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, నలుగురు మృతి చెందారు. చిత్తూరులో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 895879కు చేరింది. ప్రస్తుతం 3469 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 885209కు చేరింది. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7201కు చేరింది.
 
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో దేశ అవసరాల దృష్ట్యా కొన్ని రోజులు ఆస్ట్రాజెనెకా టీకాలు ఎగుమతిని నిలివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా దేశంలో కరోనా తీవ్రత పెరగడంతో దేశంలో టీకా ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే, ప్రభుత్వం నిర్ణయంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఏర్పాటైన 'కొవాక్స్‌' కార్యక్రమంపై ప్రభావం పడే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.