శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (14:19 IST)

నా భార్యకు కరోనా టీకా వేస్తావా.. నర్సు ముఖం పచ్చడి చేసిన వ్యక్తి

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా సాగుతోంది. అన్ని దేశాల్లో ఈ కరోనా టీకాలను ఆయా ప్రభుత్వాలు ప్రజలకు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా దేశంలోని క్యూబెక్ ప్రావిన్స్‌లోని షేర్‌బ్రూక్‌ పట్టణంలో ఉన్న ఫార్మసీలో ఓ మహిళ వ్యాక్సిన్‌ తీసుకుంది. 
 
ఈ విషయం తెల్సిన భర్త ఆగ్రహంతో ఊగిపోయాడు. అనుమతిలేకుండా తన భార్యకు వ్యాక్సిన్‌ ఇస్తావా అంటూ మండిపడుతూ ఆమెకు టీకా ఇచ్చిన నర్సుపై దాడికి దిగాడు. ఆవేశంలో ఆమె మొహంపై విచక్షణారహితంగా పిడిగుద్దులు గుప్పించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె దవాఖానలో చికిత్స పొందుతున్నది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు.