శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (12:37 IST)

దేశంలో పెరిగిన రికవరీ కేసులు.. కోటి మార్క్ దాటింది

దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గతంలో భారీగా నమోదైన కేసులు, మరణాల సంఖ్య.. కొన్నిరోజులుగా భారీగా తగ్గింది. తాజాగా బుధవారం కూడా 20వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 
 
గత 24గంటల్లో కొత్తగా 20,346 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 222 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాలతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,95,278 కి చేరగా.. మరణాల సంఖ్య 1,50,336 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
 
కేసులతోపాటు రికవరీల సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతోంది. తాజాగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కోటి మార్క్ దాటింది. కరోనా  నుంచి బుధవారం 19,587 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న  వారి సంఖ్య 1,00,16,859 కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.