పోస్ట్ కోవిడ్ సమస్యలు_అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ మృతి

tarun gogoi
tarun gogoi
సెల్వి| Last Updated: సోమవారం, 23 నవంబరు 2020 (18:52 IST)
అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కోవిడ్‌తో కన్నుమూశారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతూ గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (జిఎంసిహెచ్)లో ఆయన మృతి చెందారు.
ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ధృవీకరించారు.

కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న ఆయన వయస్సు 84. ఆయన సాయంత్రం 5.34 గంటలకు ఈ ప్రపంచాన్ని విడిచి పెట్టారని శర్మ గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వెలుపల ప్రకటించారు. ఇప్పటి వరకు అనుకున్నట్లుగా, మృతదేహాన్ని గువహతిలో సాంస్కృతిక సంస్థ శ్రీమంత శంకర్ దేవ కల ఖేత్ర వద్ద మంగళవారం ఉంచారు.

ఇక ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ గోగోయ్ కుటుంబంతో ఉండటానికి తన షెడ్యూల్ చేసిన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసి డిబృగర్ నుండి గౌహతికి తిరిగి వెళ్లారు. 'అతను ఎల్లప్పుడూ నాకు తండ్రి లాంటి వ్యక్తి. ఆయన కోలుకోవాలని లక్షలాది మంది ప్రార్థించారు. అయినా అయన మనకు దక్కలేదు.. అనిసోనోవాల్ ట్వీట్ చేశారు.దీనిపై మరింత చదవండి :