మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2020 (14:16 IST)

అంతా కొత్త కరోనా తలనొప్పి-మహారాష్ట్రలో జనవరి 31 వరకు లాక్ డౌన్..

దేశంలో కరోనా వైరస్ కొత్త రకం వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరో నెలరోజులపాటు పొడిగించింది. జవవరి 31 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉంటాయని ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే మున్సిపాలిటీల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నది. వచ్చేనెల జనవరి 5 వరకు పట్టణ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.
 
కాగా, పుణేలో ఇప్పటికే ఒకరికి కరోనా కొత్త వైరస్‌ సోకింది. మొత్తం 50 మంది నమూనాలను పరీక్షించగా ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో వారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో యూకే నుంచి వస్తున్న వారిపై అధికారులు నిఘా పెంచారు.
 
దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,25,066 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 49,373మంది మరణించగా, 55,672 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలోని ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 60 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అందులో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది.