బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (10:34 IST)

ప్రఖ్యాత బాంబే చెఫ్‌ను కాటేసిన కరోనా... అమెరికాలో విషాదం

ప్రపంచంలో ఫేమస్ చెఫ్‌లలో ఆయన ఒకరు. పేరు ఫ్లాయిడ్ కార్డోజ్. ఈయన భారతీయ చెఫ్. నివసించేది అమెరికాలో. అలాంటి ప్రఖ్యాత చెఫ్ ఇకలేరు. కరోనా మహమ్మారికి బలైపోయారు. కరోనా వైరస్ సోకడంతో 59 యేళ్ళ ఈ భారతీయ చెఫ్ న్యూజెర్సీలో కన్నుమూశారు. 
 
న్యూజెర్సీలోని బాంబే క్యాంటీన్‌, ఓ పెడ్రో రెస్టారెంట్ల అధిపతికూడా ఈయనే. ప్ర‌ప‌చం ప్ర‌ఖ్యాత చెఫ్‌గా కార్డోజ్‌కు గుర్తింపు ఉన్న‌ది. మార్చి 18వ తేదీన ఆయ‌న‌కు క‌రోనా సోకింది. క‌రోనా ప‌రీక్ష‌లో అత‌ను పాజిటివ్‌గా తేలాడు. ముంబైలో పుట్టిన కార్డోజ్‌.. మాడ్ర‌న్ ఇండియ‌న్ కుజైన్‌లో చాలా ఫేమ‌స్‌.
 
న్యూయార్క్ సిటీలో ఉన్న త‌బ్లా రెస్టారెంట్‌ను ఈయ‌నే స్టార్ట్ చేశాడు. దానికి ఎగ్జిక్యూటివ్ చెఫ్‌గా ప‌నిచేశాడు. హంగ‌ర్ ఇన్ సంస్థ‌లో ఆయ‌న క‌లిన‌రీ డైరక్ట‌ర్‌గా చేస్తున్నాడు. కార్డోజ్ మృతి ప‌ట్ల ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత చెఫ్‌లు సంతాపం తెలిపారు.