మీకు ఈ లక్షణం ఉందా? అయితే కరోనా ఉన్నట్టే...
భూగోళాన్ని కరోనా కమ్మేసింది. ఈ మహమ్మారి ఏకంగా 190 దేశాలకు విస్తరించింది. ఫలితంగా లక్షలాది మంది ఈ వైరస్ బారిపడ్డారు. 15 వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు సరికొత్త విషయాన్ని వెల్లడించారు.
కరోనా వైరస్ సోకిన వారికి జలుబు, దగ్గుతోపాటు ఇతర లక్షణాలు కూడా ఉన్నట్లు తమ పరిశోధనలో తెలిపారు. ఎవరైనా ఉన్నట్టుండి వాసన గుర్తించే స్వభావాన్ని కోల్పోయినట్టయితే కరోనా సోకినట్లు అనుమానించవచ్చని చెబుతున్నారు.
ముఖ్యంగా యువతలో ఈ లక్షణం కనిపిస్తున్నదని ఫ్రెంచ్ శాస్త్రవేత్తలతోపాటు బ్రిటన్ వైద్యులు పేర్కొన్నారు. కరోనా సోకిన వారిలో కొంతమంది రుచి స్వభావాన్నీ కోల్పోయినట్లు గుర్తించామన్నారు.
ఈ నేపథ్యంలో వాసన, రుచి కోల్పోయిన లక్షణాలను కరోనా వ్యాధి లక్షణాల జాబితాలో చేర్చారని యూకేలోని ఈఎన్‌టీ నిపుణులు ఆ దేశ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఒక్క లక్షణాన్ని నిర్ధారించడం వల్ల కరోనా సోకిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు.