మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (16:44 IST)

ఏపీలో ఒక్కసారిగా పెరిగిన పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 61178 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 1367 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 14 మంది మృతి చెందారు. అలాగే, 1248 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. 
 
ఈ కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,34,786కి చేరగా.. ఇందులో 20,06,034 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 14044కి చేరింది.
 
తాజా లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 14,708 యాక్టివ్ కేసులున్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, మృతుల్లో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున కృష్ణ, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.