శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (13:51 IST)

బ్రిటన్‌లో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 5.28లక్షల కేసులు.. లక్షమంది మృతి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే వున్నాయి. మంగళవారం ఒక్కరోజే 5.28లక్షల వైరస్ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 10.08కోట్లకు ఎగబాకింది. మహమ్మారి ధాటికి మరో 15వేల మందికిపైగా బలయ్యారు. మరణాల సంఖ్య 21.65 లక్షలకు చేరింది. ఇక బ్రిటన్లో మరణాల సంఖ్య లక్ష దాటింది.
 
బ్రిటన్ కన్నా ముందు.. అమెరికా(4.35లక్షలు), బ్రెజిల్(2.18లక్షలు), భారత్(1.53లక్షలు), మెక్సికో(1.5లక్షలు)లలో మాత్రమే లక్షకుపైగా మరణాలు నమోదయ్యాయి. బ్రిటన్‌లో వైరస్ వ్యాప్తి మెుదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ 1లక్షా 162మంది చనిపోయినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. పలు దేశాల్లో వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా.. బ్రిటన్‌లో రోజువారీ కేసుల్లో అది కనిపించటం లేదు.
 
దేశంలో కరోనా మృతుల సంఖ్య లక్ష దాటడంపై ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ విచారం వ్యక్తం చేశారు. ఇది ఎంతో భయంకరమైన పరిస్థితి అన్న ఆయన.. వైరస్‌ను ఓడించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. 
 
కొవిడ్ మృతులను దేశం స్మరించుకుంటుందని, విపత్కర పరిస్థితులను తొలగించేందుకు జాతీయ స్థాయిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ దేశంలో ఇప్పటివరకూ 36లక్షల 89వేల మంది కరోనా బారినపడ్డారు. వారిలో 16లక్షల 62 వేల మంది కరోనాను జయించారు.