ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (09:50 IST)

కరోనా హాట్‌స్పాట్‌గా మారిన వివాహ వేడుక!

నిజామాబాద్ జిల్లాలో ఓ వివాహ కార్యక్రమం కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. మొత్తం 86 మందికి కరోనా వైరస్ సోకింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఓ వివాహ కార్యక్రమం కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. 
 
ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని సిద్ధాపూర్ గ్రామం, వార్ని మండలంలో జరిగంది. ఈ గ్రామంలో జరిగిన పెళ్లికి దాదాపు 350 మందికిపైగా హాజరయ్యారు. వీరిందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా 86 మందికి పాజిటివ్ అని తేలింది. 
 
కరోనా వైరస్ సోకిన వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ఆదేసించారు. అంతేకాకుండా, కరోనా వైరస్ వ్యాప్తి చైన్‍ను తెంచేందుకు ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.