బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (18:24 IST)

మహిళను వేధించిన కాబోయే భర్త.. పెళ్లిని రద్దు చేసిన నటి

తనకు కాబోయే భర్త ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న వార్త తెలుసుకున్న పాకిస్థాన్ నటి సబా కమర్ తన వివాహాన్ని రద్దు చేసుకున్నారు. ఈమె అజీమ్ ఖాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఓ మ‌హిళ అజీమ్‌ఖాన్ లైంగికంగా వేధించిన‌ట్టు ఆరోప‌ణ‌లు వచ్చాయి. దీంతో ఆమె సబా కమర్ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ స‌బా క‌మ‌ర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.
 
"హాయ్‌. ముఖ్య‌మైన ప్ర‌క‌ట‌న చేయాల‌నుకుంటున్నా. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల నేను అజీమ్ ఖాన్‌తో పెండ్లిని ర‌ద్దు చేసుకుంటున్నా. మేం పెండ్లి చేసుకోవ‌డం లేదు. న‌న్ను ఎల్ల‌పుడూ సపోర్టుగా నిలిచే మీరు.. నా నిర్ణ‌యానికి మ‌ద్ద‌తుగా నిలుస్తారని ఆశిస్తున్నా. చేదు వాస్త‌వాల‌ను తెలుసుకోవ‌డం ఆల‌స్యం కాలేద‌ని అనుకుంటున్నా. మీకొక ముఖ్య‌మైన విష‌యం చెప్పాలి. అజీమ్‌ ఖాన్ నా జీవితంలో ఎప్పుడూ క‌ల‌వ‌లేదు. ఇద్ద‌రం ఫోన్ ద్వారా మాత్ర‌మే ఒక‌రికొక‌రం క‌నెక్ట్ అయ్యాం. ప్ర‌స్తుతం నాకు చాలా క‌ష్ట‌మైన టైం.. కానీ ఈ టైం కూడా పాస్ అవుతుంది. ఇన్‌షా అల్లా.. మీపై మ‌రింత ప్రేమ‌తో.. స‌బా క‌మ‌ర్" అంటూ సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేసింది.