మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 26 మార్చి 2021 (16:44 IST)

పెళ్లయి 10 రోజులే... కొత్తపెళ్లి కొడుక్కి 10 ఏళ్ల జైలు, ఎందుకంటే?

అతడికి పెళ్లయి 10 రోజులే అయింది. ఐతే ఇంతలో అతడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కట్టుకున్న భర్తకు పదేళ్లు జైలుశిక్ష వార్త విని నవ వధువు షాక్ తిన్నది. అసలు ఏం జరిగింది?
 
తమిళనాడులోని తిపత్తూరు జిల్లాలోని నాట్రాంపల్లి సమీపంలోని పుదుపేట పక్రిమఠం గ్రామానికి చెందిన 25 ఏళ్ల విఘ్నేష్ 2018లో ఏడేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనితో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. గురువారం నాడు ఈ కేసుపై తీర్పును వెలువరిస్తూ నిందితుడు విఘ్నేష్‌కి పదేళ్ల జైలు శిక్ష విధించింది.