శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 23 మే 2018 (17:58 IST)

ఐపీఎల్ విజేత చెన్నై కింగ్సే.. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై: ఏబీ డివిలియర్స్

34 ఏళ్ల 95 రోజుల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. 14 సంవత్సరాల తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్‌లో డివిలియర్స్ మొత్తం 114 టెస్టులు ఆడి 22 సెంచరీలతో సహా 8వేల 765 పరుగులు సాధించాడు. 228

అంతర్జాతీయ క్రికెట్‌కు సౌతాఫ్రికా కమ్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్, స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్వస్తి చెప్పాడు. 34 ఏళ్ల 95 రోజుల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. 


14 సంవత్సరాల తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్‌లో డివిలియర్స్ మొత్తం 114 టెస్టులు ఆడి 22 సెంచరీలతో సహా 8వేల 765 పరుగులు సాధించాడు. 228 వన్డేల్లో 9వేల 577 పరుగులు, 78 టీ-20ల్లో 1672 పరుగులు సాధించిన రికార్డులు ఏబీ డివిలియర్స్‌ ఖాతాలో వున్నాయి.
 
ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ స్టార్ ప్లేయర్‌గా ఉన్న డివిలియర్స్ ప్రస్తుత సీజన్లో ఐదు హాఫ్ సెంచరీలు సాధించినా తనజట్టుకు ప్లేఆఫ్ రౌండ్ బెర్త్ అందించలేకపోయాడు. క్రికెట్ చరిత్రలోనే ఓ అసాధారణ ఆటగాడిగా నిలిచిన డివిలియర్స్ తన ఆఖరిమ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో ఆడి కెరీర్‌కు స్వస్తి చెప్పాడు.
 
మరోవైపు ఐపీఎల్ 11వ సీజన్ ట్రోఫీ చెన్నై సూపర్ కింగ్స్‌దేనని ఏబీ డివిలియర్స్ జోస్యం చెప్పేశాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన డివిలియర్స్.. ఐపీఎల్ ఫైనల్స్‌లో చెన్నై-హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌లో ధోని తన మ్యాజిక్‌తో చెన్నై జట్టుని గెలిపిస్తాడని డివిలియర్స్ చెప్పాడు.