శుక్రవారం, 22 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 8 జనవరి 2019 (18:46 IST)

ఆస్ట్రేలియా గడ్డపై రికార్డ్ సృష్టించిన కోహ్లీ సేన.. భారీ నజరానా..

ఆస్ట్రేలియా గడ్డపై ఇంతకు ముందెప్పుడూ భారత్ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోలేదు. సౌరవ్ గంగూలీ సేన మాత్రం ఓసారి సిరీస్‌ను డ్రా చేసుకుంది. దాదాపు 70 ఏళ్ల తర్వాత టీమిండియా టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ అరుదైన విజయాన్ని సాధించిన కోహ్లీ సేనకు బీసీసీఐ భారీ నజరానాను ప్రకటించింది.


టెస్టు జట్టులో ఆడిన క్రికెటర్లకు తలా రూ.15 లక్షలను నజరానాగా ప్రకటించింది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన వారికి రూ.60లక్షలు ఇవ్వనుంది. కోచ్‌లకు రూ.25లక్షల్ని నజరానాగా బీసీసీఐ అందించనుంది.
 
ఇదిలా ఉంటే.. ఆసీస్ గడ్డపై నెగ్గిన భారత జట్టు కివీస్‌తో సిరీస్‌కు రెడీ అవుతోంది. ఇంకా ఆస్ట్రేలియా, కివీస్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌లో ఆడే టీమిండియా జట్టులో ఫాస్ట్ బౌలర్ బుమ్రాకి విశ్రాంతి కల్పించారు.

బుమ్రా స్థానంలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మజ్ సిరాజ్‌కు స్థానం లభించింది. అలాగే, కివీస్‌తో జరగబోయే మూడు టీ20 మ్యాచ్‌లకి సిద్దార్థ్ కౌల్‌ని జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.