గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌మెంట్ ఇక కుదరదు.. కోహ్లీ సేనకు బీసీసీఐ వార్న్

విదేశాల్లో క్రికెట్‌ సిరీస్‌లకు టీమిండియా క్రికెటర్లు తమ భార్యలతో వెళ్లడం పరిపాటి. కానీ.. త్వరలో ప్రారంభమయ్యే ఇంగ్లండ్‌ పర్యటనలో తొలి మూడు టెస్టుల వరకు భారత ఆటగాళ్లు తమ భార్య, ప్రియురాళ్లకు దూరంగా ఉండ

kohli - anushka
pnr| Last Updated: బుధవారం, 25 జులై 2018 (10:13 IST)
విదేశాల్లో క్రికెట్‌ సిరీస్‌లకు టీమిండియా క్రికెటర్లు తమ భార్యలతో వెళ్లడం పరిపాటి. కానీ.. త్వరలో ప్రారంభమయ్యే ఇంగ్లండ్‌ పర్యటనలో తొలి మూడు టెస్టుల వరకు భారత ఆటగాళ్లు తమ భార్య, ప్రియురాళ్లకు దూరంగా ఉండాలని బీసీసీఐ స్పష్టం చేసింది. కనీసం నెల రోజులపాటు తమ జీవిత భాగస్వామి, స్నేహితురాళ్లకు దూరంగా ఉండాలని సూచించింది.
 
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. ఈ వైఫల్యానికి అనుష్క, ధోనీ వైఫల్యానికి సాక్షి కారణమంటూ గతంలో విమర్శలు వచ్చాయి. ఇక.. ఇంగ్లండ్‌లో భారత్‌ టెస్ట్‌ సిరీస్‌ గెలిచి దశాబ్దం దాటిపోవడంతోపాటు ఇప్పటికే వన్డే సిరీస్‌ కోల్పోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై మరింత చదవండి :