శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 13 జూన్ 2018 (10:59 IST)

మీ సవాల్‌ను స్వీకరిస్తున్నాను.. విరాట్.. ప్రధాని నరేంద్ర మోడీ (Video)

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన సవాల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ స్వీకరించారు. 'మీ సవాల్‌ను స్వీకరిస్తున్నాను.. విరాట్! త్వరలోనే నా వీడియోను షేర్ చేస్తాను' అని ట్వీట్ చేసిన విష‌యం తెలిసి

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన సవాల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ స్వీకరించారు. 'మీ సవాల్‌ను స్వీకరిస్తున్నాను.. విరాట్! త్వరలోనే నా వీడియోను షేర్ చేస్తాను' అని ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.
 
అంతేకాకుండా, మోడీ యోగాతో పాటు పలు శారీరక వ్యాయమాలు చేసిన 2 నిమిషాల నిడివిగల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొంతమంది ప్రముఖులను ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో పాల్గొనాలని కోరుతున్నందుకు సంతోషిస్తున్నాను వ్యాఖ్యానించారు. 
 
ఈసందర్భంగా జనతాదళ్(సెక్యులర్)నేత, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి సవాల్ విసిరిరారు. అంతేకాదు 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో వ్యక్తిగతంగా అత్యధిక మెడల్స్ సాధించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రాతో పాటు ప్రత్యేకించి 40 యేళ్లు పైబడిన ధైర్యవంతులైన ఐపీఎస్ అధికారులందరికీ మోడీ సవాల్ విసిరారు. 
 
కాగా, ఆరోగ్యంగా ఉండాలంటే మీరు కూడా వ్యాయామం చేస్తూ ఫొటోలు, వీడియోలను #HumFitToIndiaFit అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌మీడియాలో మీ సన్నిహితులతో పంచుకోండి అంటూ కేంద్ర క్రీడలశాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.