శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 9 జూన్ 2018 (10:33 IST)

మోదీనా ఆయనెవరు.. అని అడుగుతున్న కెనడియన్లు..

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజున్న సంగతి తెలిసిందే. అత్యంత శక్తివంతమైన నేతల జాబితాలో మోదీకి స్థానం వుంది. అలాంటి మోదీ 75 శాతం మంది కెనడా ప్రజలకు తెలియదట. ఇది నిజమే.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజున్న సంగతి తెలిసిందే. అత్యంత శక్తివంతమైన నేతల జాబితాలో మోదీకి స్థానం వుంది. అలాంటి మోదీ 75 శాతం మంది కెనడా ప్రజలకు తెలియదట. ఇది నిజమే. 
 
కెనడాకు చెందిన యాంగస్ రీడ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడి అయ్యింది. ఈ వారంలో క్యూబెక్‌లో జీ7 దేశాల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముందు ఈ సర్వేను నిర్వహించారు. జీ7 గ్రూపులో అమెరికా, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్, ఫ్రాన్స్, యూకేలు ఉన్నాయి. 
 
ఈ సర్వేలో మోదీతో పాటు జపాన్ ప్రధాని షింజో అబే కూడా నిలిచారు. 64శాతం మంది కెనెడియన్లకు జపాన్ ప్రధాని ఎవరో తెలియదట. బ్రెజిల్ అధ్యక్షుడు మిచెల్ టెమెర్ 90 శాతం మందికి తెలియదని తేలింది. అలాగే 75 శాతం మంది కెనడియన్లు మోదీ అంటే ఎవరో తెలియదని తేలింది.