శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 5 జూన్ 2018 (10:52 IST)

2018 డిసెంబరులోనే సార్వత్రిక ఎన్నికలు.. నోమురా స్పష్టం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని.. దీంతో ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. మంచి ఫలితాలు సాధించవచ్చుననే అభిప్రాయంతో బీజేపీ అగ్రనేతలున్నట్లు సమాచారం. అంతేగాకుండా సార్వత్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని.. దీంతో ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. మంచి ఫలితాలు సాధించవచ్చుననే అభిప్రాయంతో బీజేపీ అగ్రనేతలున్నట్లు సమాచారం. అంతేగాకుండా సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సంవత్సర కాలం ఉండగానే ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశముందని ప్రపంచ ద్రవ్య వ్యవహారాల నిర్వహణ నోమురా సంస్థ వెల్లడించింది. 
 
ఇందులో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో సార్వత్రిక సమరం ఉంటుందని నోమురా సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఇందుకు కారణం ఇటీవల జరిగిన ఉప ఎన్నికలేనని స్పష్టం చేసింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ సంస్కరణలు దేశీయ ఉత్పత్తుల విలువలో ఏర్పడే ద్రవ్యలోటును భర్తీ చేసుకోగల స్థితిలో కూడా లేవని నోమురా సంస్థ విశ్లేషించింది.