Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మేమేం పిచ్చోళ్లం కాదు.. ధోనీ ఫిట్నెస్ అమోఘం : రవిశాస్త్రి

మంగళవారం, 26 డిశెంబరు 2017 (11:04 IST)

Widgets Magazine
ravi shastri

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై వస్తున్న విమర్శలపై టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఒకింత ఘాటుగానే స్పందించారు. మేం పిచ్చోళ్లం కాదు. గత 30 నుంచి 40 ఏళ్లుగా క్రికెట్ చూస్తున్నా. కోహ్లీ కేవలం పదేళ్ల నుంచే క్రికెట్‌లో ఉన్నాడు. 26 ఏళ్ల వయసున్న ఆటగాడిని కూడా ధోనీ చిత్తు చేయగలడు అంటూ కితాబిచ్చాడు.
 
36 యేళ్ల వయసులో కూడా ధోనీ మైదానంలో అద్భుతంగా రాణిస్తూ యువ క్రికెటర్లకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నాడు. అదేసమయంలో 2019 ప్రపంచ కప్‌లో వికెట్ కీపర్ రేసులో ధోనీదే మొదటి స్థానం అంటూ ఛీప్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ డైరెక్ట్‌గా చెప్పాడు. అయితే, ఇదేసమయంలో ధోనీపై క్రిటిక్స్ విమర్శలు కూడా ఎక్కువవుతున్నాయి. 36 ఏళ్ల ధోనీ జట్టులో అవసరమా? అంటూ విమర్శిస్తున్నారు. దీనిపై రవిశాస్త్రి ఒకింత ఘాటుగానే స్పందించారు. ధోనీ వయసు 36 ఏళ్లు అయినప్పటికీ... అతనికన్నా పదేళ్ల చిన్నవారైన ఆటగాళ్లకంటే చాలా ఫిట్‌గా, వేగంగా ఉన్నాడని చెప్పాడు. 
 
"మేమేం పిచ్చోళ్లం కాదు. గత 30 నుంచి 40 ఏళ్లుగా క్రికెట్ చూస్తున్నా. కోహ్లీ కేవలం పదేళ్ల నుంచే క్రికెట్ లో ఉన్నాడు. 26 ఏళ్ల వయసున్న ఆటగాడిని కూడా ధోనీ చిత్తు చేయగలడు. విమర్శలు గుప్పిస్తున్న వారికి ఒకటే సూచన చేస్తున్నా. 36 ఏళ్ల వయసులో వారు ఎంత వరకు క్రికెట్ ఆడగలిగారు? ఒక రెండు పరుగులైనా వేగంగా పరుగెత్తగలిగారా? మీరు రెండు రన్స్ చేసే లోపు, ధోనీ మూడు పరుగులు చేయగలడు. ప్రస్తుత క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అత్యున్నత క్రికెటర్లలో ధోనీ ఒక్కడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పైగా, ధోనీలో ఉన్న గొప్ప లక్షణాలు మార్కెట్‌లో దొరికేవి కావు. మీరు వాటిని ఎక్కడా కొనలేరు కూడా. పిచ్చిపిచ్చిగా మాట్లాడటం ఆపేయండి" అంటూ శాస్త్రి విమర్శకులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

మేం పిచ్చోళ్లం కాదు.. పిచ్చిపిచ్చిగా మాట్లాడటం ఆపండి: రవిశాస్త్రి వార్నింగ్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫిట్‌నెస్‌పై వస్తున్న విమర్శలపై టీమిండియా కోచ్ ...

news

సౌతాఫ్రికాకు వన్డే టీమ్ సెలక్షన్ : షమీకి పిలుపు.. రాహుల్ ఔట్

భారత క్రికెట్ జట్టు ఈనెలాఖరులో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో మూడు ...

news

లగ్జరీ కారులో అమ్మాయికి లిప్‌లాక్ కిస్ ఇస్తూ అడ్డంగా బుక్కైన క్రికెటర్

నాథన్ లియాన్. తన మణికట్టు మాయాజాలంతో తమ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన క్రికెటర్. వైవాహిక ...

news

టీ20ల్లో డబుల్ సెంచరీ ఆలోచన చేయడం అత్యాశే : రోహిత్ శర్మ

ఇండోర్ వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన రెండో ట్వంటీ 20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ...

Widgets Magazine