ధోనీ సమయస్ఫూర్తికి జోహార్లు..(Video)

Last Updated: సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (14:01 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో సమయ స్ఫూర్తితో వ్యవహరిస్తాడు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కూల్‌గా వుంటాడు. తాజాగా హామిల్టన్ వేదికగా కివీస్‌తో ఆదివారం ముగిసిన చివరి టీ-20 మ్యాచ్‌లోనూ ఓపెనర్ స్టీఫర్ట్‌ని ధోనీ స్టంపౌట్ చేశాడు.


ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ చేస్తుండగా జాతీయ జెండాని చేతిలో పట్టుకుని ఓ భారత అభిమాని మైదానంలోకి ప్రవేశించాడు. అతను తనవైపు రావడాన్ని పసిగట్టిన ధోనీ.. అలానే నిల్చుండి పోయాడు. 
 
భావోద్వేగానికి గురైన అభిమాని నేరుగా వచ్చి అతని కాళ్లపై పడిపోయాడు. అభిమాని ధోనీ కాళ్లపై పడుతుండగా, జాతీయ జెండా నేలను తాకబోతుండటాన్ని గమనించిన మహేంద్రుడు.. వెంటనే స్పందించాడు. 
 
అభిమాని చేతుల్లోని ఆ జెండాని తన చేతుల్లోకి తీసుకుని.. అతడిని వెళ్లిపోవాలని సూచించాడు. ఆపై జెండాని భద్రతా సిబ్బందికి అప్పగించాడు. ఇప్పటికే భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ) హోదాలో ఉన్న ధోనీ.. విదేశీ గడ్డలో జాతీయ జెండా గౌరవం నిలపడంపై నెటిజన్లు, అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
క్రికెట్ ఫ్యాన్స్ ఈ వీడియో విపరీతంగా షేర్ చేస్తున్నారు. కాగా హామిల్టన్‌లో కివీస్‌తో జరిగిన చివరి ట్వంటీ-20 మ్యాచ్‌ను ఆడటం ద్వారా ధోనీ తన ఖాతాలో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ధోనీ 300వ టీ-20 మ్యాచ్‌ను ఆడిన భారత క్రికెటర్‌గా రికార్డు సాధించాడు.దీనిపై మరింత చదవండి :