హార్దిక్ పాండ్యా, రాహుల్‌కు షాక్.. రెండు వన్డేలపై నిషేధం..

hardik pandya
Last Updated: శుక్రవారం, 11 జనవరి 2019 (15:58 IST)
కాఫీ విత్ కరణ్ హిందీ టీవీ షోలో మహిళలను కించపరిచేలా భారత్ ఆల్ రౌండర్ హార్దీక్ పాండ్య, కెఎల్ రాహుల్‌‌కు షాక్ తగలనుంది. వీరిద్దరికీ రెండు వన్డేల మ్యాచ్‌లపై బీసీసీఐ నిషేధం విధించింది. ఈ మేరకు బీసీసీఐ వీరిద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 
 
బీసీసీఐ షోకాజ్ నోటీసులపై స్పందించిన పాండ్య... తన వివరణ ఇచ్చుకున్నప్పటికీ సీఓఏ సంతృప్తి చెందలేదు. దీంతో పాండ్య, రాహుల్‌కు రెండు మ్యాచ్‌ల్లో సస్పెన్షన్ విధించాలని సీఓఏకు సిఫార్స్ చేసినట్టు బీసీసీ పాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. 
 
ఇందులో సీఓఏ సభ్యులు డయానాదే తుది నిర్ణయమని వినోద్ రాయ్ చెప్పుకొచ్చారు. ఏదిఏమైనా పాండ్య వ్యాఖ్యలు సరికావు. క్షమించరానిదంటూ రాయ్ వ్యాఖ్యానించారు. దీనిపై మరింత చదవండి :