మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 మార్చి 2018 (17:42 IST)

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా దినేష్ కార్తీక్

ఐపీఎల్ (ఇండియాన్ ప్రీమియర్ లీగ్) 11వ సీజన్‌ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. అయితే ఈ యేడాది జరిగిన వేలంలో గౌతమ్ గంభీర్‌ ఢిల్లీ గూటికి చేరడంతో కెప్టెన్ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంలో కోల్‌కతా

ఐపీఎల్ (ఇండియాన్ ప్రీమియర్ లీగ్) 11వ సీజన్‌ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. అయితే ఈ యేడాది జరిగిన వేలంలో గౌతమ్ గంభీర్‌ ఢిల్లీ గూటికి చేరడంతో కెప్టెన్ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సందిగ్ధంలో పడిపోయింది. ఎప్పటినుంచో జట్టులో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప, ఆస్ట్రేలియా యువ ఆటగాడు క్రిస్ లిన్, విండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌లకు ఈ యేడాది కెప్టెన్సీ ఇస్తారని అందరూ భావించారు. కానీ ఈ ఊహలను తారుమారు చేస్తూ.. కోల్‌కతా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. 
 
కార్తీక్‌కి టీం ఇండియాతో పాటు కోల్‌కతా జట్టు తరపున మంచి రికార్డు ఉంది. దీంతో ఈ సీజన్‌లో కార్తీక్‌ మాత్రమే గంభీర్ స్థానాన్ని భర్తీ చేయగలడని జట్టు యాజమాన్యం తీర్మానించింది. ఈ సందర్భంగా దినేష్ కార్తీక్ మాట్లాడుతూ ఇది తనకు దక్కిన గొప్ప అవకాశం అని అన్నాడు. ఈ యేడాది తమ జట్టు చాలా దృఢంగా ఉందని, యువ ఆటగాళ్లతో తమ జట్టు ఈ సీజన్ కోసం సిద్ధంగా ఉందని తెలిపాడు. అభిమానులు సీజన్ మొత్తం తమకు మద్దతుగా ఉండాలని కార్తీక్ కోరాడు.