గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2017 (14:42 IST)

క్రికెట్ దిగ్గజం మిల్కా సింగ్ ఇకలేరు...

భారత మాజీ టెస్ట్ క్రికెటర్ మిల్కా సింగ్ ఇకలేరు. ఆయన శుక్రవారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 75 యేళ్లు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిల్కా సింగ్‌కు గుండెపోటు రావడ

భారత మాజీ టెస్ట్ క్రికెటర్ మిల్కా సింగ్ ఇకలేరు. ఆయన శుక్రవారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 75 యేళ్లు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిల్కా సింగ్‌కు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
 
1960లో భారత్ తరపున ఆయన నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడారు. మిల్కాసింగ్‌కు అన్నయ్య అయిన క్రిపాల్ సింగ్ దేశం తరపున క్రిపాల్ సింగ్ 14  టెస్టు మ్యాచ్‌లు ఆడారు. వీరిద్దరూ 1961-62 మధ్య కాలంలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు.
 
ఎడమచేతివాటం బ్యాట్స్‌మెన్ అయిన మిల్కా సింగ్ ఒక మంచి ఫీల్డర్ కూడా. తన 17వ ఏట అప్పటి మద్రాసు రాష్ట్రంలో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన మిల్కాసింగ్.. 18వ యేట తొలి టెస్ట్ మ్యాచ్ ఆడారు. మిల్కాసింగ్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఎనిమిది సెంచరీలతో నాలుగు వేలకు పైగా పరుగులు చేశారు.