మంగళవారం, 14 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 12 నవంబరు 2017 (16:07 IST)

దారుణ స్థితిలో శ్రీలంక టీమ్ : దుమారం రేపిన భజ్జీ ట్వీట్

శ్రీలంక క్రికెట్ జట్టును ఉద్దేశించి భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయన తన ట్వీట్‌ను ఉపసంహరించుకున్నారు.

శ్రీలంక క్రికెట్ జట్టును ఉద్దేశించి భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయన తన ట్వీట్‌ను ఉపసంహరించుకున్నారు. జింబాబ్వేతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో లంకేయులు చిత్తుగా ఓడిపోయారంటూ గుర్తు చేయగా, దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో భజ్జీ తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో శ్రీలంక ఘోరంగా ఓడిపోయిందని... తొలి ఇన్నింగ్స్‌లో 200, రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసిందని ట్వీట్ చేశాడు. తన కెరియర్‌లోనే అట్టడుకు స్థాయికి శ్రీలంక పడిపోయిందని... జట్టును ఇలా చూడటం చాలా బాధాకరంగా ఉందని చెప్పాడు. 
 
త్వరలోనే వారు కోలుకుంటారని... మళ్లీ అంతర్జాతీయ స్థాయికి చేరకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపింది. పలువురు నెటిజన్లు మండిపడ్డారు. శ్రీలంక జట్టుకు చెందిన కొందరు ఆటగాళ్లు కూడా తమ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో, తన ట్వీట్‌ను భజ్జీ డిలీట్ చేశాడు.