మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (17:31 IST)

ట్వంటీ20 మ్యాచ్‌లకు గుడ్‌బై చెప్పేసిన క్రిస్ గేల్

వెస్టిండీస్ క్రికెట్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్వంటీ20 మ్యాచ్‌లకు గుడ్‌బై చెప్పేశారు. దుబాయ్ వేదిగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలోభాగంగా, శనివారం ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత వెస్టిండీస్ బ్యాటింగ్‍‌ చేపట్టగా, ఓపెనర్‌గా క్రిస్ గేల్ బరిలోకి దిగాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఔటయ్యాడు.  ఆ తర్వాత క్రిస్ గేల్ మైదానం నుంచి వెళ్తూ త‌న బ్యాట్‌ను స్టేడియంలోని ప్రేక్ష‌కుల వైపు ఎత్తి చూపాడు. దీంతో అత‌ను అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై ప‌లికిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. 
 
హెల్మెట్ తీసేసిన గేల్‌.. త‌న చేతిలో ఉన్న బ్యాట్‌ను ప్రేక్ష‌కుల వైపు చూపిస్తూ.. డ్రెస్సింగ్ రూమ్ దిశ‌గా నడిచాడు. ఫీల్డ్ నుంచి వెళ్లిన గేల్‌కు త‌న జ‌ట్టు స‌భ్యులు గ్రీట్ చేశారు. చాలా సైలెంట్‌గా త‌న‌దైన స్ట‌యిల్‌లో ప‌వ‌ర్ ప్లేయ‌ర్ క్రిస్ గేల్ .. వెస్టిండీస్‌కు త‌న చివ‌రి మ్యాచ్ ఆడేసిన‌ట్లు సంకేతం ఇచ్చాడు. 
 
నిజానికి శనివారం నాటి మ్యాచ్‌లో గేల్ అద్భుత‌మైన స్టార్ట్ ఇచ్చాడు. స‌న్‌గ్లాస్‌లు పెట్టుకుని గ్రౌండ్‌లోకి దిగిన గేల్‌.. రెండు భారీ సిక్స‌ర్ల‌తో ఆశ‌లు రేపాడు. ఇక విండీస్‌కు భారీ స్కోర్‌ను అందిస్తాడ‌నుకున్న స‌మ‌యంలో గేల్ 15 ర‌న్స్ చేసి బౌల్డ‌య్యాడు.