ఐసీసీ కొత్త నిబంధనలు.. ఫేక్ ఫీల్డింగ్.. ధోనీకి శిక్ష తప్పదా?

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (16:56 IST)

ms dhoni

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త నిబంధనలు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కష్టాలు తెచ్చిపెట్టేలా వుంది. క్రికెట్‌లో నిబంధనలను కఠినతరం చేస్తూ.. ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇంకా వాటిని పక్కాగా అమలు చేస్తుంది. అయితే ఫేక్ ఫీల్డింగ్ నిబంధనలు ధోనీని శిక్షకు గురి చేసే అవకాశం ఉన్నట్లు క్రీడా పండితులు చెప్తున్నారు. 
 
గత నెల 28 నుంచి ఐసీసీ కొత్త నిబంధనలు అమలులోకి రాగా, ఆ మరుసటి రోజే క్వీన్స్ ల్యాండ్‌కు చెందిన ఓ క్రికెటర్, బంతి చేతిలో లేకున్నా, దాన్ని విసిరేస్తున్నట్టు యాక్ట్ చేయగా, ఆ జట్టుపై ఐదు పరుగుల పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో సాధారణంగా కీపింగ్ చేస్తున్న సమయంలో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు వికెట్ల మధ్య పరుగులు తీస్తున్న సమయంలో దూరం నుంచి వచ్చే బంతిని ధోనీ తన చేతులతో అడ్డుకుంటాడు. దాన్ని వికెట్లపైకి నెడుతాడు. కానీ ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం.. ధోనీ అలాంటి బంతిని అందుకోవడంలో విఫలమై, ఖాళీ చేతులను వికెట్లవైపు చూపిస్తే, శిక్ష ఖాయమవుతుంది. అది ఫేక్ ఫీల్డింగ్ కిందకే వస్తుంది. 
 
అయితే ఐసీసీ కొత్త నిబంధనలపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఫైర్ అయ్యారు. ఫేక్ ఫీల్డింగ్ మోసం కాబోదని.. అదో ట్రిక్ అని కొత్త నిబంధనలో ఫేక్ ఫీల్డింగ్‌పై పెనాల్టీని విధించడం సబబు కాదన్నారు. ఈ నిబంధనను మరోసారి పరిశీలించాలని డిమాండ్ చేశాడు.దీనిపై మరింత చదవండి :  
Icc New Rule Fake Fielding Sanjay Manjrekar Mahendra Singh Dhoni India Vs Australia 2017-18

Loading comments ...

క్రికెట్

news

ధోనీని అనుకరిస్తూ డాన్స్ చేసిన 'శ్యామ్‌'.. వీడియో వైరల్

భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఏం పని చేసినా అది సంచలనమే. పైగా, అలాంటి పనులు చేయడం ...

news

స్టీవ్ స్మిత్‌కు గాయం.. ఆందోళనలో ఆస్ట్రేలియా?

భారత్‌తో ట్వంటీ-20 సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ...

news

ఇంటివాడు కాబోతున్న భారత పేసర్ భువనేశ్వర్ కుమార్

భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు ...

news

సౌతాఫ్రికా పర్యటనే కోహ్లీకి అసలైన సవాల్ : సౌరవ్ గంగూలీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గొప్ప కెప్టెన్ అనిపించుకునేందుకు దక్షిణాఫ్రికా ...