దుబాయ్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరు ఆదివారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ పోరులో ఆస్ట్రేలియాకు 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 85 పరుగులు చేశాడు.
కేన్ విలియన్స్ అర్థ శతకంతో అదరగొట్టాడు. ఫలితంగా 4 వికెట్లు కోల్పోయి.. 172 పరుగులు చేసింది కివీస్. న్యూజిలాండ్ బ్యాటర్లలో మార్టిన్ గప్తిల్ (28), మిచెల్ 11, ఫిలిఫ్స్ 18, నీషమ్ 13, సీఫర్ట్ 8 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ మూడు, జంపా ఓ వికెట్ పడగొట్టారు.
అంతకుముదు ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. న్యూజిలాండ్ జట్టు తొలిసారి పొట్టి కప్పులో తుది పోరు ఆడబోతుండగా, ఆసీస్‌కిది రెండో ఫైనల్ కావడం గమనార్హం. గత 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన కివీస్.. ఇప్పుడా జట్టుపై ప్రతీకారం తీర్చుకుని ఈ ఏడాది రెండో ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని భావిస్తుంది.
ఇప్పటికే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచిన విలియమ్సన్ సేన అదే ఊపులో పొట్టి కప్పునూ పట్టేయాలనుకుంటోంది. 2010 ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన ఆసీస్.. ఈ సారి మాత్రం ట్రోఫీని వదలకూడదనే గట్టిపట్టుదలతో ఉంది.
ఈ మ్యాచ్ కోసం కంగారులు జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. పాకిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడిన జట్టునే బరిలోకి దించారు. అయితే, కివీస్ జట్టులో గాయం కారణంగా కాన్వే తప్పుకోగా, అతడి స్థానంలో టిమ్ సీఫర్ట్ చేరాడు.
ఇరు జట్ల వివరాలు..
న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడం మిల్నే, టిమ్ సౌథీ, ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మ్యాథ్యూ వేడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆండం జంపా, జోష్ హేజిల్‌వుడ్.