గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 అక్టోబరు 2022 (09:44 IST)

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : భారత్ గెలవాలంటూ పాక్ ఆటగాళ్ళ ప్రార్థనలు

ind vs pak
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం సూపర్-12, గ్రూపు బిలో భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచితీరాలంటూ పాకిస్థాన్ ఆటగాళ్లతో పాటు.. ఆ దేశ క్రికెట్ అభిమానులు కోరుకుంటూ, ప్రార్థనలు చేస్తున్నారు. దీనికి ఓ కారణం లేకపోలేదు. 
 
పాకిస్థాన్ జట్టు ఇప్పటివరకు భారత్, జింబాబ్వే జట్లతో మ్యాచ్‌లు ఆడింది. ఈ రెండు మ్యాచ్‌లలో ఆ జట్టు ఓడిపోయింది. దీంతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అదేసమయంలో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లపై భారత్ గెలిస్తే పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశాలు చేజారిపోతాయి. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో భారత్ ఖచ్చితంగా గెలవాలంటూ పాకిస్థాన్ ఆటగాళ్లు ప్రార్థనలు చేస్తున్నారు. అంతేకాదండోయ్.. జింబాబ్వే, బంగ్లాదేశ్ జట్లపై కూడా విజయం సాధించాలని కోరుకుంటుంది. 
 
మరోవైపు, పాకిస్థాన్ జట్టు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లతో ఆడాల్సివుంది. వీటిలో ఆదివారం క్రికెట్ పసికూన నెదర్లాండ్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గనుక పాకిస్థాన్ ఓడితే మాత్రం ఆ జట్టు నేరుగా ఇంటికి చేరుతుంది.