Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వారిని చూసి ప్రపంచం ఈర్ష్య పడుతోంది : సునీల్ గవాస్కర్

మంగళవారం, 3 అక్టోబరు 2017 (12:24 IST)

Widgets Magazine
sunil gavaskar

భారత క్రికెట్ జట్టుపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీలంక పర్యటనతో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లలో టీమిండియా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనపరిచారంటూ కొనియాడారు. 
 
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత జట్టు 5-0తోనూ, స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. దీనిపై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ, ప్రపంచంలో అత్యుత్తుమ టాప్ ఆర్డర్ భార‌త జ‌ట్టు సొంతం అని సునీల్‌ కొనియాడారు.
 
ముఖ్యంగా శిఖర్ ధవన్‌ - రోహిత్ శర్మ‌, రహానే - రోహిత్‌ శర్మల ఓపెనింగ్‌ జోడీతో పాటు, వన్‌డౌన్‌లో వచ్చే కోహ్లీపైనా ఆయ‌న పొగ‌డ్త‌ల‌ జల్లు కురిపించారు. ఈ టాప్‌-3 బ్యాట్స్‌మెన్లను చూసి ప్రపంచం ఈర్ష్య పడుతోందన్నారు. ఈ ముగ్గురూ చాలా సార్లు అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశార‌ని, దీంతో వారి త‌ర్వాత నాలుగో స్థానంలో వచ్చే వారికి 30 నుంచి 40 ఓవర్ల మధ్య బ్యాటింగ్‌ దక్కుతోంద‌ని గ‌వాస్క‌ర్‌ అన్నారు.
 
నాగ్‌పూర్‌లో జ‌రిగిన వన్డేలో కోహ్లీ 55 బంతుల్లో 39 పరుగులు చేయడంపై స్పందిస్తూ, నాగ్‌పూర్‌లాంటి పిచ్ మీద బ్యాటింగ్ చేయ‌డం అంత సులభమేం కాద‌ని, అది ఇండోర్‌ లేదా బెంగళూరు పిచ్‌ల మాదిరిగా ఉండ‌క‌పోవ‌డంతో కోహ్లీ కొంత ఇబ్బంది పడ్డాడన్నారు. మొత్తంమీద శ్రీలంకతోపాటు స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లలో భారత క్రికెటర్ల ప్రదర్శన అత్యుత్తమంగా ఉందన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

భారత్ చేతిలో ఓటమికి సంపూర్ణ అర్హులం : ఆస్ట్రేలియా కెప్టెన్

భారత చేతిలో ఓడిపోవడానికి సంపూర్ణ అర్హులమంటూ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ స్టీవ్ ...

news

ఆస్ట్రేలియాతో ట్వంటీ20 సమరం : నెహ్రా, కార్తీక్‌లకు పిలుపు

ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసింది. ఇకపై 20 ఓవర్ల ట్వంటీ-20 సిరీస్ ఆరంభంకానుంది. వన్డే ...

news

రోహిత్ ధమాకా: ఐదో వన్డేలో భారత్ ఘన విజయం .. అగ్రస్థానం..

ఐసీసీ ర్యాంకుల పట్టిక అగ్రస్థానంలో నిలవాలంటే ఖచ్చితంగా నెగ్గాల్సిన పోరులో భారత్ ...

news

నాగ్‌పూర్ వన్డే : భారత్ విజయలక్ష్యం 243 రన్స్

ఐదో వన్డేల సిరీస్ సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా జరగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో ...

Widgets Magazine