శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (14:02 IST)

ఆసీస్ మూడో టెస్టు.. మహిళా అంపైర్‌ పోలోజాక్ రికార్డ్

Claire Polosak
ఆస్ట్రేలియా మహిళా అంపైర్‌ క్లెయిర్‌ పోలోజాక్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా, భారత్ మధ్య సిడ్నీ క్రికెట్ మైదానంలో జరుగుతోన్న మూడో టెస్టుకు పోలోజాక్‌ నాలుగో(రిజర్వ్‌) అంపైర్‌గా ఉన్నారు. పురుషుల టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో ఓ మహిళా అంపైర్‌గా విధులు నిర్వర్తించడం 144 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం.
 
వరల్డ్ క్రికెట్ లీగ్‌లో భాగంగా 2019లో నమీబియా, ఒమన్‌ల మధ్య ఐసీసీ డివిజన్‌-2 పురుషుల వన్డే మ్యాచ్‌కు ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌గా ఆమె పనిచేశారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆతిథ్య జట్టు తమ ఐసీసీ అంతర్జాతీయ ప్యానెల్‌ అంపైర్ల నుంచి నాలుగో అంపైర్‌ను నియమించుకోవచ్చు. 
 
దీంతో 32 ఏళ్ల పోలోజాక్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) అరుదైన అవకాశాన్ని ఇచ్చింది. పురుషుల టెస్ట్ క్రికెట్‌లో అంపైర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తొలి మహిళగా పోలోజాక్ చరిత్ర సృష్టించినందుకు అభినందనలు తెలుపుతూ ఐసీసీ ట్వీట్ చేసింది.