సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 నవంబరు 2019 (17:39 IST)

భారత్- బంగ్లాదేశ్‌ల టెస్టు సిరీస్.. కామెంటేటర్‌గా ధోనీ? (video)

భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గెస్ట్ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య టెస్టు పోటీలు నవంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్‌ను ప్రసారం చేసేందుకు స్టార్ స్పోర్ట్స్ సంస్థ సర్వం సిద్ధం చేసింది.
 
తొలిసారిగా భారత్‌లో జరిగే డే-నైట్ మ్యాచ్ ఇది కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ మధ్య భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ టెస్టు సిరీస్‌లకు చెందిన కెప్టెన్లను కామెంటేటర్లుగా వ్యవహరించే కొత్త కార్యక్రమాన్ని స్టార్ స్పోర్ట్స్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అంగీకారం ఇవ్వాలని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి స్టార్ స్పోర్ట్స్ సంస్థ లేఖ రాసింది. 
 
ఇంకా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా చీఫ్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తారని తెలిపింది. ధోనీ మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెడతాడని ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌‌కు ఆయన కామంటేటర్‌గా మారడం అంతగా నచ్చలేదు. అయితే ధోనీ కామెంటేటర్‌గా వ్యవహరించరని తెలుస్తోంది. ధోనీ ఇంకా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించలేదు. 
 
బీసీసీఐ క్రికెటర్‌గానే ధోనీ వ్యవహరిస్తున్న తరుణంలో కామంటేటర్‌గా వ్యవహరిస్తే రెండింతల ఆదాయం తీసుకునే ఆటగాడిగా విమర్శలు ఎదుర్కొనే అవకాశం వుంది. ఫలితంగా ధోనీ స్టార్ స్పోర్ట్స్ నిర్వహించే చీఫ్ కామెంటేటర్ ప్రోగ్రామ్‌కు దూరంగా వుంటాడని సమాచారం. లేకుంటే మహీ చిక్కుల్లో పడే అవకాశం వుంది. ఇప్పటికే రిటైర్మెంట్‌ తీసుకోవాలని ఒత్తిడి, విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కామెంటేటర్‌గా వ్యవహరిస్తే.. ఇక పూర్తిగా క్రికెట్‌ నుంచి తప్పుకోవాల్సి వుంటుందని క్రీడా పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.